2024 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ మొదటి నుంచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గానే ఉన్నాడు. మధ్యలో కొన్నాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గరికి ఆరెంజ్ క్యాప్ వెళ్లినా మళ్లీ తిరిగి కింగ్ దగ్గరికి వచ్చేసింది. అయితే ఇన్ని పరుగులు సాధిస్తున్నా విమర్శలు మాత్రం ఆగలేదు. స్ట్రైక్ రేట్ ఎక్కువ లేదు... జట్టు విజయం కోసం కాకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడు. గేమ్‌లో ముందుకు వెళ్లే కొద్దీ స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది అని. కానీ కింగ్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలు అన్నిటికీ చెక్ చెప్పేశాడు.