ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు చేయడం ఇది నాలుగో సారి. ఐపీఎల్ 2013 సీజన్లో విరాట్ కోహ్లీ 634 పరుగులు చేశాడు. విరాట్ ఒక ఐపీఎల్ సీజన్లో 600కు పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అనంతరం 2016 సీజన్లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఎనిమిది సంవత్సరాలు అయినా ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ అవ్వలేదు. అనంతరం ఐపీఎల్ 2023 సీజన్లో 639 పరుగులు చేశాడు. ఇప్పుడు వరుసగా రెండో సీజన్లో కూడా 600కు పైగా పరుగులు సాధించాడు. ఓవరాల్గా చూసుకుంటే నాలుగో సారి.