టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడే జట్ల సంఖ్య 16 నుంచి 20కి పెరిగింది. ఒక్కో జట్టుకు తొమ్మిది మ్యాచ్‌ల వరకు ఆడే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌లు పెరిగాయి కాబట్టి సింగిల్ టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్‌ల్లోనే 319 పరుగులు చేశాడు. ఇంతవరకు ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.