భారత క్రికెటర్ల ఫిట్నెస్, గాయాల నిర్వహణపై జాతీయ క్రికెట్ అకాడమీ తీరుపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆటగాళ్ల గాయాల మేనేజ్మెంట్లో ఎక్కడో లోపం ఉందని, దీనికి సంబంధించి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.