టీమిండియా తదుపరి సిరీస్ కోసం తమ ప్రాక్టీస్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఒకే నెట్స్‌లో చెమటోడ్చారు. పక్కపక్కనే ఉన్న నెట్స్‌లో ఇద్దరూ ఏకాగ్రతతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.