ఆటలో గెలుపోటములు అనేవి సహజం. ఎంత దిగ్గజ ఆటగాడికైనా కాలం కలిసి రాకపోయినా, మైదానంలో అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా ఎదురు దెబ్బలు తప్పవు. ఒక బ్యాడ్ సీజన్ అనేది ఐపీఎల్లో ఇప్పటిదాకా స్టార్ ప్లేయర్స్ అందరూ చూసిందే. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఇలా మనదేశంలోని స్టార్ ప్లేయర్లు అందరూ బ్యాడ్ సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వారే. కానీ వారు బౌన్స్ బ్యాక్ అయ్యారంటే దానికి కారణం ఆ టీమ్స్ మేనేజ్మెంట్స్ నుంచి వారికి దొరికిన సపోర్ట్. కానీ కేఎల్ రాహుల్కు అది తక్కువ అయినట్లు నిన్న రాత్రి ఇంటర్నెట్లో వైరల్ అయిన ఒక వీడియోను చూసి చెప్పవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా... కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద మైదానంలోనే సీరియస్ అయిన విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.