ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ ఆటతీరు అంచనాలకు అందని విధంగా సాగుతోంది. నాలుగు మ్యాచ్‌ల క్రితం ఆర్సీబీ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి దాదాపు అవుట్ అయిపోయింది అనుకున్నారంతా. కానీ సడెన్‌గా ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులోకి తిరిగి వచ్చింది. ఇప్పటికి ఆర్సీబీ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఏడు ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ చాలా బాగుంది కాబట్టి మిగతా రెండు మ్యాచ్‌లూ గెలిచి కాస్త అదృష్టం కలిసొస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అనుకోవచ్చు. సెకండాఫ్‌లో అద్భుతంగా ఆడుతుంది కానీ ఫస్టాఫ్‌లో ఆర్సీబీ ఆటతీరు ఫ్యాన్స్ కూడా తిట్టుకునేలా ఉంది.