ఐపీఎల్ 2024 సీజన్లో నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్లో నేటి మ్యాచ్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. పంజాబ్, ఆర్సీబీల్లో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు ముంబై ఇండియన్స్ తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలుస్తుంది. కాబట్టి రెండు జట్ల ఫ్యాన్స్ ఈ మ్యాచ్ గురించి చాలా ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.