భారత మహిళా క్రికెట్ సంచలనం, ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో 10,880 పరుగుల మైలురాయిని అందుకుంది. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా సరికొత్త చరిత్ర సృష్టించింది.