ప్రస్తుతం ఉన్న మొత్తం జట్టులో అద్భుతమైన ఫాంలో ఉన్న బ్యాటర్. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో 150కి పైగా స్ట్రైక్‌రేట్, 60కి పైగా యావరేజ్‌తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. గత సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బీభత్సమైన ఫాంలో ఉన్నాడు. టీమ్‌లో తన రోల్ కూడా చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకూ క్రీజులో ఉండేలా ఆడాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. తనదైన రోజున విరాట్ ఎంతటి ప్రమాదకారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు... అప్పుడే ఇంత స్కోరు వచ్చిందా అనిపించేలా సింగిల్స్, డబుల్స్ కూడా వేగంగా తీసే సామర్థ్యం తన సొంతం. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కీలకం.