ఐపీఎల్ 2024 సీజన్లో నేడు ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది వర్చువల్ నాకౌట్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్‌తోనే నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవరికి దక్కుతుందనేది కన్ఫర్మ్ అవుతుంది. కానీ బెంగళూరులో వర్షం పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే... అప్పుడు రెండు జట్లకూ చెరో పాయింట్ లభిస్తుంది. 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. 13 పాయింట్లతో ఆర్సీబీ ఇంటి బాట పడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సీఎస్కే ప్రత్యర్థి ఎవరనేది సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ఆడాల్సిన చివరి మ్యాచ్‌లు నిర్ణయిస్తాయి. ఈ రెండు జట్లలో ఒకటి సీఎస్కేతో ఎలిమినేటర్‌లో తలపడుతుంది.