ఐపీఎల్ 2024 సీజన్లో నేడు ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది వర్చువల్ నాకౌట్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్‌తోనే నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవరికి దక్కుతుందనేది కన్ఫర్మ్ అవుతుంది. కానీ బెంగళూరులో వర్షం పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ జరిగి చెన్నై గెలిస్తే... 16 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. దీంతోపాటు చెన్నైకి క్వాలిఫయర్ 1 ఆడే అవకాశం కూడా ఉంటుంది. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి పాలైతే చెన్నై... కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో క్వాలిఫయర్ 1 ఆడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మూడు జట్లలో చెన్నైకే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది. ఆ జట్లు తమ మ్యాచ్‌ల్లో ఓడితే వాటి రన్‌రేట్ మరింత తగ్గుతుంది. అది చెన్నైకి అడ్వాంటేజ్ అవుతుంది.