ఈ టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా 15 మెంబర్స్ స్క్వాడ్‌లో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ కాగా, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈక్వేషన్లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లూ జట్టులోకి వచ్చినా మధ్యలో మరో పేసర్ కచ్చితంగా అవసరం అవుతాడు. అక్కడ టీమిండియాకు ఉన్న ఏకైక ఆప్షన్ హార్దిక్ పాండ్యా. రవీంద్ర జడేజా స్పిన్ ఆల్‌రౌండ్ విభాగంలో ప్రభావం చూపించగలడు. కానీ ప్రస్తుతం జట్టుకు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కచ్చితంగా అవసరం. హార్దిక్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించగలడు. అవసరం అయితే మ్యాచ్‌లు ఫినిష్ చేయగలడు. జట్టుకు అవసరం అయినప్పుడు బంతితోనూ మెరవగలడు. కాబట్టి టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియాకు కీలక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానే.