భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. ఎప్పట్లాగే తన కూల్ అండ్ స్టైలిష్ లుక్తో అందరినీ ఆకట్టుకున్న ధోనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.