ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా గతేడాది చరిత్ర సృష్టించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకుంది. ఇప్పుడు వెస్టిండీస్‌లో జరిగే ఈ వరల్డ్ కప్‌ను గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ ఒకేసారి ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకు ఎక్కనుంది. ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలు కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా దగ్గరే ఉన్నాయి.