ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆటతోనే కాదు...ఆస్కార్ రేంజ్ ఫర్ ఫార్మెన్స్ లతోనూ ఆకట్టుకుంది. ఒక్క గెలుపు కోసం కాబూలీలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వికెట్లు తీయటం, బంగ్లా బ్యాటర్లు కొట్టే పరుగులు ఆపటమే కాదు...అంతకు మించిన నటనతోనూ కళ్లు చెమర్చే రేంజ్ ఫర్ ఫార్మెన్స్ ఇచ్చారు. బంగ్లా దేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11.5 బంతి దగ్గర జరిగింది ఈ ఘటన. అప్పడుప్పుడే సన్నగా వర్షం పడుతోంది.