భారీ స్కోరు సాధించినా మ్యాచ్ ఓడిపోవడంపై క్రికెటర్ హనుమ విహారి స్పందిస్తూ బౌలింగ్ వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మన బౌలర్లు ప్లాన్ సరిగ్గా అమలు చేయలేకపోయారని, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయకపోవడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని విహారి విశ్లేషించారు.