టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో, అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే చర్చ క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. భువి పునరాగమనంపై విమర్శకులు పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.