ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్, పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ పూరీ జగనాథుడిపై ఉన్న భక్తిని తనదైన రీతిలో చాటుకున్నారు. నేటి నుండి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా పూరీ బీచ్ లో 4. 5 టన్నుల ఇసుకను ఉపయోగించి 101 జగన్నాథుని రూపాలతోపాటు .. భారీ విగ్రహాన్ని కూడా తయ్యారు చేసారు సుదర్శన్ పట్నాయక్. అలాగే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల రథాలను మట్టితో నిర్మించారు. జై జగన్నాథ్ అంటూ తన భక్తిని చాటుకున్నారు సుదర్శన్ పట్నాయక్. మూడు రథాలను సూచించే భక్తి, సమానత్వం, ఐక్యతా భావాన్ని ప్రజల దెగ్గరకు చేర్చాలనేది తన ఆర్ట్ వర్క్ సూచిస్తుందని అన్నారు సుదర్శన్ పట్నాయక్. పూరీ బీచ్ లో నిర్మించిన ఈ ఆర్ట్ వర్క్ భక్తులను ఆకట్టుకుంటుంది.