షాంఘై వేదికగా జరిగిన 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన టీమ్ ఇండియా ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ భేటీలో యువత ప్రతిభను అభినందించిన మోడీ, భారత్‌ను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి రంగంలో యువత సాధిస్తున్న విజయాలు దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.