సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు ధ్వంసమై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా గ్యాంగ్టక్, గ్యాల్షింగ్జి ల్లాల్లోని రింబి తదితర గ్రామాల్లో భారీగా మట్టి చరియలు విరిగిపడి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది