పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలో శ్రీరాముడి ఊరేగింపు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి రామనామ స్మరణతో మార్మోగించారు. ఈ వేడుకలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.