కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు తమ టచ్‌లోనే ఉన్నారని, భవిష్యత్తులో మోదీకి దిమ్మతిరిగిపోయే రోజులు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.