దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ప్రముఖ నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు.