నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' ప్రీ-రిలీజ్ వేడుకలో బాలీవుడ్ నటుడు, ప్రముఖ డాన్సర్ రాఘవ్ జుయల్ తన డ్యాన్స్‌తో స్టేజ్‌ను షేక్ చేశారు. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా, ఈవెంట్ సందర్భంగా అనిరుధ్ సంగీతం అందించిన సాంగ్స్‌కు అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి తనదైన శైలిలో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. యాంకర్ సుమతో కలిసి ఆయన వేసిన అడుగులు, చేసిన స్లో-మోషన్ మూమెంట్స్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.