తెలుగు ప్రేక్షకులు కాజల్ అగర్వాల్ ను ముద్దుగా చందమామ అని పిలుస్తారు. కానీ, ఇప్పుడు ఆవిడకు 'గూఢచారి', 'మేజర్' చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క కొత్త ట్యాగ్ ఇచ్చారు. అది ఏమిటో తెలుసా? క్వీన్ ఆఫ్ మాసెస్. ఆ బిరుదు ఇవ్వడమే కాదు... ఇప్పటి వరకు ఆమెను ప్రేక్షకులు చూడని కొత్త అవతారంలో చూపిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా శశికిరణ్ తిక్క సమర్పణలో రూపొందుతున్న సినిమా 'సత్యభామ'. ఇందులో యువ హీరో నవీన్ చంద్ర ఆమెకు పెయిర్. ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. ఆయన సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. Gear up to celebrate 'The Queen of Masses' @MSKajalAggarwal like never before on the big screens ❤️🔥❤️🔥#Satyabhama in theatres worldwide on May 17th 🎯▶️ https://t.co/TbBMJ0g6QY@MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka… pic.twitter.com/svK00yfv0y— Aurum Arts Official (@AurumArtsOffl) April 22, 2024