సోషల్ మీడియాలో 'బాసింగ బలాలు'గా పాపులర్ అయిన యూట్యూబర్ ఈశ్వర్ సాయిపై నటి, బిగ్బాస్ ఫేమ్ మాధురీ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాధురీ రాథోడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది