నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రంలో హీరోయిన్గా నటించిన కయాదు లోహర్ స్వయంగా తెలుగులో మాట్లాడి వేదికపై ప్రత్యేక ఒక ఆకర్షణగా నిలిచారు. తెలుగు ప్రేక్షకులపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.