దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్'. ఈ చిత్రంలోని అద్భుతమైన, హృత్తులను హత్తుకునే సంభాషణలకు గానూ దర్శకుడు కమ్ రైటర్ వెంకీ అట్లూరి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకున్నారు. చిత్రంలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఆయన ప్రతిభకు సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.