బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతి వారాంతం తన అభిమానులను కలువడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వీకెండ్ కూడా తన ముంబై నివాసం 'జల్సా' వెలుపల వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ దర్శనమిచ్చారు. ఆయనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.