కొంతకాలం సీక్రెట్ డేటింగ్ తర్వాత హీరోయిన్ అదితి రావ్ హైదరి, హీరో సిద్ధార్థ్‌లు పెళ్లికి సిద్ధమయ్యారు. రీసెంట్గా గుట్టుచప్పుడు కాకుండ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఆఫిషియల్ చేశారు. వరంగల్ వనపర్తి టెంపుల్ తమళ్ పురోహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కెమెరా మ్యాన్, మీడియాకు అనుమతి లేకపోవడం అంతా ఇది పెళ్లి వేడుక అనుకున్నారు. సీక్రెట్ పెళ్లి చేసుకున్నారంటూ కథనాలు కూడా వచ్చేశాయి. కానీ రెండు రోజులు తర్వాత మెల్లిగా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి కాదు రింగులు మార్చుకున్నామంటూ ఇద్దరు ట్విస్ట్ ఇచ్చారు.అలా పస్ట్ టైం ఇద్దరు తమ రిలేషన్లో ఒపెన్ అప్ అయ్యారు. జంటగా ఎన్నోసార్లు మీడియాకు చిక్కిన ఎనాడు తమ ప్రేమయాణాన్ని బయటపెట్టలేదు. చివరకు పెళ్లికి సిద్ధమై ఆఫీషియల్ చేశారు. అయతే తన పర్సనల్ విషయంలో సిద్ధార్థ్ చాలా గొప్యత పాటిస్తాడు. ఎన్నో అదితితో డైరెక్ట్‌గా కెమెరాలకు చిక్కినా.. అవైయిడ్ చేస్తూ వెళ్లిపోయేవాడు. అలాంటి సిద్ధార్థ్ తాజాగా అదితితో నిశ్చితార్థం, పెళ్లిపై తొలిసారి స్పందించాడు.