వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేయడం రాజకీయంగా కలకలం రేపింది. తనను ఒక సందర్భంలో జగన్ ముందే సజ్జల కొట్టారంటూ విజయసాయి రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చారు. ఇందుకు కావాలంటే తనపై ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే సాయి రెడ్డి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని సజ్జల మండిపడ్డారు.