విజయవాడ సమీపంలోని కృష్ణా నదిపై ఉన్న 130 ఏళ్ల నాటి చారిత్రక రైల్వే వంతెన తొలగింపు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 1893లో నిర్మించిన ఈ బ్రిడ్జిని కేవలం రాతి బండలు, గానుగ సున్నంతో అత్యంత పటిష్టంగా కట్టారు.