మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో నటుడు షాయాజీ షిండే సమావేశం అయ్యారు. చెట్టు విషయంలో ఆయన రాసిన కవితలను పవన్ కు వినిపించారు. తాను వృక్ష ప్రసాద యోజన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టానని, మహారాష్ట్రలో ఇలాంటి కార్యక్రమం చేపట్టానని తెలిపారు. అలాంటి కార్యక్రమాన్నే ఏపీలో మొదలుపెట్టాలని తాను పవన్ ను కోరినట్లు చెప్పారు. ఆలయంలో అభిషేకం చేసిన ప్రతి భక్తుడికి ఒక మొక్కను ప్రసాదం రూపంలో ఇస్తే పచ్చదనం మరింత పెరుగుతుందని చెప్పారు.