అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై కిరాతక దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్పై పోలీసులు జరిపిన కాల్పుల వార్తతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా రాప్తాడులో ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని, ఉన్మాదికి సరైన శిక్ష పడిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.