తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో వినాయక ఆలయం దాటిన తర్వాత కిలోమీటర్ దూరంలో చిరుత సంచరించడాన్ని వాహనదారులు గుర్తించారు. రోడ్డుపై చిరుత కనిపించడంతో ప్రయాణికులు, భక్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో అటవీ శాఖ మరియు టీటీడీ అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు.