తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో (ISRO) చైర్మన్ వి. నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన, స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలు ప్రసాదించారు. దేశ అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న విజయాలు మరింత ముందుకు సాగాలని ఆయన శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.