అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో కురుస్తున్న వర్షాలకు ప్రసిద్ధ గుర్రాయి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. చుట్టూ పచ్చని అడవులు, కొండల నడుమ పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతున్న ఈ వాటర్ ఫాల్స్ అందాలు చూడచక్కగా ఉండి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.