రైల్వే ఇంజనీరింగ్ అద్భుతాలకు విజయవాడ వేదికైంది. నగరంలో ఒకే మార్గంలో ఒకదానిపై మరొకటి వెళ్లేలా సరికొత్తగా నిర్మించిన 'ట్రైన్ ఓవర్ ట్రైన్' బ్రిడ్జ్ ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వింత వంతెనను చూసేందుకు, దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు ప్రయాణికులు, స్థానికులు అమిత ఆసక్తి చూపుతున్నారు.