చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఈనెల 14వ తేదీ హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పులివర్తి నానిని కాపాడటానికి ప్రయత్నించిన గన్మెన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు ప్రధాన నిందితులు భానుకుమార్రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులందర్నీ చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. 150 మందికి పైగా రాడ్లు, సుత్తులతో దాడి చేశారు. ఓ బండరాయి నాని ఛాతికి బలంగా తగిలింది. ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని త్రుటిలో తప్పించుకోగా అడ్డుకున్న గన్మెన్ ధరణిపైనా దాడి జరిగింది. దీంతో ఆయన ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.