South Indian cuisine Nethi Bobbatlu Recipe : ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెసిపీ.. భక్ష్యాలను టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా
Nethi Bobbatlu : నేతి బొబ్బట్లు ఇంట్లోనే టేస్టీగా, మెత్తగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఉగాదికి ఈ టేస్టీ ఫుడ్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Continues below advertisement
90 Mins
Total time
30 Mins
Cook Time
30 Mins
Prep Time
5 People
Serves
Medium Difficulty
Veg
Diet
Continues below advertisement
Ingredients
- 1 Cup శనగపప్పు
- 1.25 Cup నీళ్లు
- 1 Pinch పసుపు
- 1 Pinch ఉప్పు
- 1 Teaspoon నెయ్యి
- 1.5 Cup మైదా పిండి
- 0.5 Cup గోధుమ పిండి
- 3 Tablespoon నెయ్యి
- 1 Pinch ఉప్పు
- 1 Pinch పసుపు
- 0.5 Cup నీళ్లు
- 1 Teaspoon నెయ్యి
- 1 Cup బెల్లం
- 3 Tablespoon నెయ్యి
- 0.5 Teaspoon యాలకుల పొడి
- 2 Piece బటర్ పేపర్
Continues below advertisement
Main Procedure
Step 1
శనగపప్పును గంటనాన బెట్టి ఉప్పు, పసుపు, నెయ్యి వేసి కుక్కర్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి.
Step 2
మైదాపిండి, గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, పసుపు వేసి పిండిలో నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
Step 3
శనగపప్పులో నీరు వేరు చేసి దానిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి.
Step 4
బెల్లం కరిగిన తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని వేసి నెయ్యి వేస్తూ బాగా ఉడికించాలి.
Step 5
ఇప్పుడు చపాతీ పిండిని పూరీలా చేసుకుని దానిలో పూర్ణం ఉంచి.. చపాతీలుగా ఒత్తుకోవాలి.
Step 6
పాన్‌పై నెయ్యి వేసి.. ఈ బొబ్బట్లను రెండువైపులా రోస్ట్ చేసుకుంటే నేతి బొబ్బట్లు రెడీ.