South Indian cuisine Mutton Chutney Recipe : మటన్ పచ్చడి కాదండోయ్ చట్నీనే ఇది.. నోటికి మరింత రుచిగా, సరికొత్త టేస్టీ రెసిపీ

Non Veg Chutney Recipe : మటన్ పచ్చడి గురించి వింటూనే ఉంటాము. కానీ మటన్ చట్నీ గురించి తెలుసా? రెండూ ఒకటే అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇదో మరోరకం, టేస్టీ వంటకం. రెసిపీ ఎలానో చూసేద్దాం.

Continues below advertisement
మటన్ చట్నీ రెసిపీ(Images Source : Instagram)
70 Mins Total time
50 Mins Cook Time
50 Mins Prep Time
10 People Serves
Hard Difficulty
Non Veg Diet
Continues below advertisement

Ingredients

  • 500 Gram మటన్
  • 1.5 Kilogram టోమాటో
  • 2 Tablespoon వెజిటెబుల్ ఆయిల్
  • 1 Tablespoon కశ్మీరి కారం
  • 1.5 Tablespoon కారం
  • 1 Tablespoon ఉప్పు
  • 1 Teaspoon పసుపు
  • 2 Tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 10 Piece పుదీనా
  • 1 Cup కొత్తిమీర
  • 1.5 Cup నీళ్లు
  • 50 Gram ధనియాలు
  • 10 Gram నువ్వులు
  • 20 Gram కాళోంజి
  • 500 Milliliter నూనె
  • 30 Piece వెల్లుల్లి రెబ్బలు
  • 1 Teaspoon జీలకర్ర
  • 1 Teaspoon ఆవాలు
  • 12 Piece ఎండు మిర్చి
  • 20 Piece కరివేపాకు
  • 10 Piece నిమ్మరసం
Continues below advertisement

Main Procedure

Step 1

కుక్కర్​లో టమోటో ముక్కలు, నూనె, కశ్మీరి కారం, కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి బాగా కలిపి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

Step 2

అనంతరం మూత తీసేసి.. మీడియం మంటమీద కుక్కర్​ని స్టౌవ్​ మీద ఉడికించాలి. నీరు ఆవిరై.. దగ్గరగా అవుతున్నప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.

Step 3

పాన్​లో ధనియాలు, నువ్వులు, కాళోంజి సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేయాలి. చల్లారిన తర్వాత వాటిని పౌడర్​గా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం మటన్​ మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో వేసి పేస్ట్​గా చేసుకోవాలి.

Step 4

ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని.. వెల్లుల్లిని వేయించుకోవాలి. దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి తిప్పిన తర్వాత మటన్ పేస్ట్​ని ఉడకనివ్వాలి.

Step 5

ఉడికిన తర్వాత ధనియా పౌడర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి. అనంతరం నిమ్మరసం వేసి కలిపి స్టౌవ్​ ఆపేస్తే మటన్ చట్నీ రెడీ.

Sponsored Links by Taboola