Will people believe Chandrababu words about the implementation of schemes : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ ఇచ్చిన ఓ రిపోర్టును ప్రజల ముందు పెట్టి.. పథకాల అమలుకు తాము ఎంత కిందా మీదా పడుతున్నామో వివరించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు వెసులుబాటు దొరకడం లేదని.. దొరికినప్పుడు అమలు చేస్తామన్నట్లుగా చెప్పారు. ఇదే విషయాన్ని విపక్ష నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకాల అమలుపై చంద్రబాబు మోసం చేశారని అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం చంద్రబాబు మాటల్ని వక్రీకరిస్తున్నారని .. హామీ ఇచ్చిన ప్రకారం.. ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నక్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు.
ఆర్థిక విధ్వంసం నిజమే కానీ ప్రజలకు సంబంధం లేదు !
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని.. ఆ విధ్వంసం కళ్ల ముందే ఉందని టీడీపీ అధినేత తరచూ చెబుతున్నారు. తాజాగా ఆయన డేటా రూపంలో బయట పెట్టారు. నీతి ఆయోగ్ నివేదికే సాక్ష్యమని ప్రజల ముందు పెట్టారు. ఎంత మందికి అర్థం అవుతుందో .. ఎంత మంది దాన్ని పట్టించుకుంటారన్నది పక్కన పెడితే..ఓ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఈ కారణం చూపి.. సూపర్ సిక్స్ విషయంలో వెనుకడుగు వేయలేరు. అలా చేస్తే పథకాల విషయంలో మోసం చేశారని వైసీపీకి నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పించినట్లే అవుతుంది.
అప్పులు చేసి, నిధులు మళ్లించి పథకాలు అమలు చేసే విధానానికి వ్యతిరేకం !
రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పధకాలకు వచ్చిన నిధులను మళ్లించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే అప్పులు చేసి పథకాలు అమలు చేయడం అనే విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆస్తులను సృష్టించాలన్నది ఆయన విధానం. కానీ ఇప్పుడు మరో మార్గం లేదు. సూపర్ సిక్స్ లో రెండు అత్యంత కీలక పథకాలు.. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ రెండు పథకాలను ముందుగా అమలు చేస్తే..ఇతర వాటి విషయంలో సమయం తీసుకున్నా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. జగన్ చేసింది విధ్వంసమే కారణంగా ఆ కారణం.. ఇవ్వలేకపోతున్నామని చెప్పడాన్ని ప్రజలు హర్షించరు. అందుకే చంద్రబాబు .. అప్పులు చేసైనా ఇస్తామని అంటున్నారు.
ప్రజలు పథకాలే కోరుకుంటారు.. కారణాలు కాదు !
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ..జగన్ చేసిన అప్పులపై స్కీమ్స్ ప్రకటన చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి ఓ స్పష్టత ఉంది. అలాంటి సమయంలో పథకాలను ప్రకటించకుండా రాష్ట్రాన్ని చక్కదిద్దుతామని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్న కానీ నని అవసరమైన వారికి మాత్రం అందాల్సిన ఖచ్చితమైన సంక్షేమాన్ని మాత్రమే ఇస్తానని ప్రకటించి ఉంటే.. ప్రజలు అర్థం చేసుకునేవారన్న అభిప్రాయం ఉంది. కానీ హామీలు ఇచ్చేశారు .. గెలిచారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమలు చేయాల్సిందే. చేయలేకపోయామని చెబితే అది పెద్ద మైనస్ అవుతుంది.