Lok Sabha Today: లోక్‌సభలో ఇవాళేం చేయబోతున్నారు? కేబినెట్ భేటీ వెనుక మాస్టర్ ప్లాన్.. డీలిమిటేషన్ అస్త్రం సిద్ధం?
cabinet meeting: ఢిల్లీ రాజకీయాల్లో శనివారం అత్యంత కీలకమైన రోజుగా మారబోతోంది.ఉదయం 11:30 గంటలకు జరగనున్న కేంద్ర మంత్రివర్గ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

What are you going to do in the Lok Sabha today: ఢిల్లీ రాజకీయాల్లో శనివారం అత్యంత కీలకమైన రోజుగా మారబోతోంది. శుక్రవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఊహించని విధంగా వీగిపోవడం, మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వెనుక ఒక భారీ వ్యూహం దాగి ఉంది. ఉదయం 11:30 గంటలకు జరగనున్న కేంద్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం భారత రాజకీయాల్లో కొత్త మలుపుకు సంకేతంగా కనిపిస్తోంది.
వ్యూహాత్మక మార్పులతో కొత్త బిల్లు?
శుక్రవారం సభలో జరిగిన చర్చలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలు ఇండియా కూటమి పార్టీలు ఒక కీలక ప్రతిపాదన చేశాయి. నియోజకవర్గాల పెంపు 50 శాతానికి ఉండాలని, మహిళా కోటాలో ఓబీసీలకు స్పష్టత ఉండాలని కోరాయి. ఈ అంశాలను బిల్లులో చేర్చితే మద్దతిస్తామని అఖిలేష్ ప్రకటించారు. కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ సవరణలకు పచ్చజెండా ఊపి, విపక్షాలు కోరిన 50 శాతం సీట్ల పెంపు క్లాజును కొత్త బిల్లులో చేర్చి మళ్ళీ సభ ముందుకు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
విపక్షాల అస్త్రాన్నే ఆయుధంగా మలచుకోవడం
ఒకవేళ ప్రభుత్వం 50 శాతం సీట్ల పెంపుతో కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే, దాన్ని వ్యతిరేకించడం విపక్షాలకు అత్యంత కష్టతరంగా మారుతుంది. తాము అడిగిన సవరణలను ప్రభుత్వం చేర్చిన తర్వాత కూడా వ్యతిరేకిస్తే, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ఓబీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి, విపక్షాల డిమాండ్లను నెరవేర్చినట్లు చూపిస్తూనే తన అజెండాను నెగ్గించుకోవడం మోదీ-షా ద్వయం మార్కు రాజకీయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
శనివారం నాటి సమావేశం ప్రాధాన్యత
సాధారణంగా శనివారం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం అరుదు. శుక్రవారంతోనే కథ ముగిసిపోతే శనివారం సభతో పనేంటి? అన్న ప్రశ్నకు కేబినెట్ భేటీ సమాధానం చెప్పబోతోంది. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే, మధ్యాహ్నం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, అదే రోజు చర్చ జరిపి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మహిళా బిల్లు కేవలం ఒక సాకు మాత్రమేనని, అసలు లక్ష్యం డీలిమిటేషన్ ప్రక్రియను పట్టాలెక్కించడమేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విపక్షాలు అడిగినట్లుగా సీట్ల సంఖ్యను భారీగా పెంచడం ద్వారా, దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గకుండానే ఉత్తరాది సీట్లను పెంచే మధ్యేమార్గం ఏదైనా ప్రభుత్వం సిద్ధం చేసిందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహాన్ని కొంతవరకు చల్లార్చవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.
విపక్ష కూటమికి అగ్నిపరీక్ష
ప్రభుత్వం గనుక అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించిన సవరణలను స్వీకరిస్తే, ఇండియా కూటమిలో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్ , దక్షిణాది పార్టీలు ఒంటరి అయ్యే అవకాశం ఉంది. ఈ గందరగోళాన్ని సృష్టించడం ద్వారా విపక్షాల ఐక్యతను దెబ్బతీయడం కూడా బీజేపీ వ్యూహంలో భాగం కావచ్చు. కి శనివారం ఉదయం 11:30 గంటల కేబినెట్ భేటీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. శుక్రవారం నాటి ఓటమి ని శనివారం నాటి విజయం 'గా మార్చుకునే దిశగా అమిత్ షా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















