అన్వేషించండి

Adulterated ghee politics : నెయ్యికల్తీపై ఎవరి రాజకీయం వారిదే - భక్తుల మనోభావాలను టీడీపీ, వైసీపీ పట్టించుకోవా ?

TDP and YSRCP : తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై టీడీపీ, వైసీపీ పోటీపడి రాజకీయం చేస్తున్నాయి. కానీ భక్తుల మనోభావాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Politics Over Tirupati laddu prasadam: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శల యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో అసలు నిజానిజాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఇరు పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆరోపణల పర్వం - ఎదురుదాడి వ్యూహాలు

కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ టీడీపీ ఆధారాలతో సహా బయటపెట్టగా, వైఎస్సార్‌సీపీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. జంతు కొవ్వు లేదని తమకు క్లీన్ చిట్ లభించిందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం మొదలుపెట్టింది. అయితే, సరఫరా అయిన పదార్థం అసలు నెయ్యే కాదని సిట్  నివేదికలో తేలినప్పుడు క్లీన్ చిట్ అనే మాట ఎక్కడ నుంచి వచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా రోజుకో కొత్త మలుపుతో ఈ వ్యవహారం రచ్చకెక్కుతోంది.

అప్రస్తుత అంశాల చుట్టూ రాజకీయం                                 

వైఎస్సార్‌సీపీ తనను తాను సమర్థించుకునే క్రమంలో ఇందాపూర్ డెయిరీ ప్రస్తావనతో పాటు హెరిటేజ్ సంస్థను కూడా వివాదంలోకి లాగింది. వాస్తవానికి ఈ కల్తీ నెయ్యి సరఫరాకు, హెరిటేజ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేకపోయినా, రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల అసలు చర్చ పక్కదారి పట్టి, సంస్థల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలే ప్రధానంగా మారుతున్నాయి.

న్యాయపోరాటాలు - కమిటీల చుట్టూ వివాదం                    

ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో వైసీపీ తరపున టీటీడీ విషయాల్లో న్యాయపోరాటం చేసిన సుబ్రహ్మణస్వామి ఏకసభ్య కమిటీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. కానీ  అనుకూల తీర్పు రాలేదు.  అటు ప్రభుత్వం మాత్రం తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని, ఏకసభ్య కమిటీ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెబుతోంది.  

భక్తుల మనోభావాలు పట్టించుకోని నేతలు 

ఈ రాజకీయ రణరంగంలో భక్తుల ఆవేదనను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పూర్తిగా విస్మరించాయనే విమర్శలు వస్తున్నాయి. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం అయిందనే బాధ భక్తుల్లో ఉంది. కానీ, నేతలు మాత్రం తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రత్యర్థిని బద్నాం చేయడానికి పడుతున్న తాపత్రయం చూసి సామాన్య భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆరోపణలతో కాలక్షేపం చేయకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే అసలైన పరిష్కారం. ఆలయ పవిత్రతను కాపాడటం, నాణ్యమైన ముడి పదార్థాల సేకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ చదరంగంలో భక్తిని పావుగా వాడుకోకుండా, తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని  భక్తుల డిమాండ్ గా మారింది.   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget