గుడివాడపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఎంత అవసరమో..అంతే స్థాయిలో గుడివాడలో టీడీపీ విజయం సాధించడం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.
టీడీపీ కృష్ణాజిల్లా మహానాడును గుడివాడలో నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ మహానాడుపై టీడీపీ అదినేత కూడ ఫోకస్ పెట్టారు. ఈ నెల 29న కృష్ణా జిల్లా గుడివాడలో జరగనున్న జిల్లా మహానాడుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. చంద్రబాబుతోపాటు ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, అచ్చెన్నాయుడు, యనమల, తదితర నేతలు హజరయ్యారు.
గుడివాడను కేంద్రంగా చేసుకొని వైసీపీకి చెక్ చెప్పాలని టీడీపీ నేతలు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అవసరం అయిన అన్ని వనరులను సమీకరిస్తున్నారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ప్రధాన అజెండా అయితే, అందులో సబ్ క్లాజ్ కింద గుడివాడ, గన్నవరాన్ని కూడ చేర్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం సాధించటమే ప్రదాన అజెండాగా పెట్టుకుంది. గుడివాడకు ప్రాతినిద్యం వహిస్తున్న మాజీమంత్రి కొడాలి నాని, టీడీపీని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి, చంద్రబాబును కుటుంబ సమేతంగా రాజకీయంగా అన్ని వైపులా టార్గెట్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌తోపాటుగా భువనేశ్వరిపై కూడా నాని కామెంట్ చేసి సంచలనం సృష్టించారు.
అసెంబ్లీ వేదికగా జరిగిన అంశంపై చంద్రబాబు ఇప్పటికే సవాల్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు గుడివాడపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక గన్నవరం కూడా ఇదే కోవలోకి తీసుకోవాలని టీడీపీ భావిస్తుంది. గన్నవరం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ కూడా వైసీపీ గూటికి చేరి, టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సొంత వైసీపీలో కూడ వంశీ వ్యతిరేక వర్గం తయారు కావటంతో అక్కడ కూడా వంశీ ఎదురు ఈదాల్సిన పరిస్దితి ఏర్పడింది.
ఈ పరిస్థితిలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో టీడీపీ అధినేత మొదలుకొని గుడివాడ, గన్నవరంలో టీడీపీ సాధారణ కార్యకర్త వరకు ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఆ వర్గం ఎటువైపు....
గన్నవరం, గుడివాడలో టీడీపీ పట్టుకోసం ప్రయత్నిస్తున్న వేళ ఓ వర్గం ఎటు వైపు ఉంటుందనే చర్చ మొదలైంది. 40సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి పరిణామం ఎదురవ్వలేదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ రెండు నియెజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ఎటు వైపు ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. టీడీపీకి ఆ సామాజిక వర్గం అండగా ఉంటుందనటంలో సందేహం లేదు. అందులో భాగంగానే గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ పాతుకుపోవటానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు వైసీపీలో ఉన్నారు. టీడీపీని చంద్రబాబు ఫ్యామిలిని విమర్శిస్తున్నారు.
కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగడంతో చంద్రబాబు కంట తడి పెట్టుకున్నారు. ప్రవర్తించిన కొడాలి వ్యవహర శైలి పై ఆ వర్గం గుర్రుగా ఉందని టీడీపీ చెబుతోంది.దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలను సమర్దించే అవకాశం లేదని కూడ ప్రచారం జరుగుతుంది.