Telangana cabinet expansion is likely to happen before Diwali : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు పది నెలలుగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పని తీరును బట్టి భర్తీ చేస్తామని పార్టీ హైకమాండ్ సూచనలు పంపింది. అయితే అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. కేవలం ఎనిమిది సీట్లలోనే గెలిచారు. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అయింది. 


ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధాన శాఖలకు మంత్రుల కొరత  ఉందని పాలనపై ప్రభావం చూపుతున్నందునఖ ఖాళీల భర్తీకి అవకాశం కల్పించాలని హైకమాండ్ నుకోరారు. చివరికి మొత్తం ఆరు సీట్లను భర్తీ చేసుుకోవడానికి హైకమాండ్ అనుమతి ఇవ్వడంతో ఆయన పేర్లను ఫైనల్ చేయించుకునేందుకు ఓ సారి ఢిల్లీ వెళ్లే  అవకాశాలు ఉన్నాయి. సామాజికవర్గాల వారీగా అందరికీ న్యాయం చేయాల్సి ఉండటంతో అన్ని రకాల సమీకరణాలను చూసుకుని తుది జాబితాను సిద్ధం చేసుకున్నారు. 


వీసా పాస్‌పోర్టు లేకుండానే ప్రపంచాన్ని చుట్టేస్తున్న దెయ్యం- తాజాగా నిజామాబాద్‌లో ల్యాండ్‌ అయిందట!


ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంి.  రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మైనార్టీ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి  బీఆర్ఎస్ కు నుంచి కాంగ్రెస్ లోకి చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  కేబినెట్ రేసులో ఆయన కూడా ఉన్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జిల్లా నుంచి మదన్ మెహన్ తో పాటు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తూనే ఉన్నారు.  ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఆశావహుల  జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరికి మాత్రమే పదవి దక్కే ఛాన్స్ ఉంది.   హైదరాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన హైదరాబాద్ నుంచి కేబినెట్ బెర్త్ ను ఆశిస్తున్నారు. 



Also Read: చుక్క బొట్టు వేస్తే గాని అక్కడి అమ్మాయిలకు పెళ్లి జరగదు, తరతరాలుగా అదే సాంప్రదాయం