TDP News :  తెలుగుదేశం మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లకు అవకాశం దక్కలేదు. దీంతో చాలా మంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతారని అనుకుంటూ వస్తున్నారు. నిజానికి టీడీపీ సీనియర్ల పాజిటివ్ తీసుకుంటున్నారు. యువతకు అవకాశం ఇవ్వాలి కదా అంటున్నారు. ల


మంత్రి పదవి రాకపోతే ఏమవుతుంది : గోరంట్ల               


మంత్రి పదవి రాకపోతే ఏమవుతుందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. మంత్రి పదవి వస్తుందని నా వరకు నేను ఆశించాను... రాజకీయ కెరీర్ ఆఖరి దశలో గుర్తింపు వస్తుందని భావించాను. అయినా... మంత్రి పదవి రాకపోతే ఏమవుతుంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేశామా? నాలుగు పర్యాయాలు రాజమండ్రిలో ఏ పదవి ఉంటే పనిచేశాను? రాజమండ్రి రూరల్ లో మూడు పర్యాయాలు ఏ పదవి ఉంటే పనిచేశాను? పదవులు ముఖ్యం కాదు... పనిచేయడం ముఖ్యం అన్నారు.  ఈ సారి టీడీపీ... జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుందని... పొత్తు ధర్మం ప్రకారం సీట్ల సర్దుబాటు, మంత్రిపదవుల సర్దుబాటు తప్పదని, కొన్ని సామాజిక సమీకరణాలు కూడా చూసుకున్న మీదట తనకు మంత్రి పదవి రాలేదన్నారు. 


ఏపీలో మంత్రులకు శాఖలు ఫిక్స్, పవన్‌కు గ్రామీణాభివృద్ధి - హోంశాఖ మంత్రిగా అనిత, మిగతా వారికి ఇవీ


యువతకు అవకాశం ఇవ్వాలన్న అయ్యన్న                     


తాను గతంలో మంత్రిగా చేశానని, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారని, కొత్త మంత్రులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.  నాడు ఎన్టీ రామారావు తనకు 25 ఏళ్ల వయసులో మంత్రి పదవి ఇచ్చారని, మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? ఇప్పుడూ అంతే... జూనియర్లు ఎదగాలనే మేం కోరుకుంటాం అని అయ్యన్న వ్యాఖ్యానించారు. కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే సీనియర్లం మేమెందుకు బాధపడతాం... మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, కొత్త మంత్రులకు అండగా నిలుస్తాం అన్నారు.                            


కొత్త ఏపీ టీడీపీ చీఫ్‌గా పల్లా శ్రీనివాస్ - త్వరలో అధికారిక ప్రకటన


మంత్రిగా చేసి రిటైరవ్వాలనుకున్న పలువురు నేతలు                                  


 కళా వెంకట్రావు,  జ్యోతుల నెహ్రూ సహా చాలా మంది నేతలు మంత్రి పదవుల్ని ఆశించారు. యనమల రామకృష్ణుడు కూడా ఎమ్మెల్సీ కోటాలో ఆశించారు. అయితే చంద్రబాబు ఈ సారి ఎక్కువగా కొత్తతరానికి అవకాశం కల్పించారు. అయితే సీనియర్ నేతలకు ప్రత్యామ్నాయ పదవుల ద్వారా ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. దీంతో టీడీపీ సీనియర్లలో అసంతృప్తి బయటకు కనిపించడం లేదు.