Revanth Reddy is changing the code that the dressing style of political leaders : యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరూ పిలుస్తూంటారు. నిజానికి ఆయన తాత అయి కూడా చాలా కాలం అయింది.  కానీ ఆయన వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికీ 54 ఏళ్లే.   తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు కానీ వయసయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్ బాల్ మ్యాచులూ ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్‌ని తన డ్రెస్సింగ్ స్టైల్‌లోనూ చూపిస్తారు.         



రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్‌లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది.  ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని.. ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్ చేస్తూంటారు. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ నమ్మకాన్ని వమ్ము చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ నాయకుడైనా మామూలు డ్రెస్‌లలో ఉండొచ్చని.. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినా సరే మార్పేమీ ఉండదని నిరూపిస్తున్నారు.




ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ తన క్యాంప్ ఆఫీసులో సొంత ఇంటినే ఉపయోగించుకుంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం ఎవరైనా ఇంటి దగ్గర కలవాలనుకుంటే.. ఆయన  టీ షర్టుల్లోనే కనిపిస్తారు. ఇంటి దగ్గర రిలాక్సింగ్ ఆయన...  తనకు ఇష్టమైన టీ షర్టులు వేసుకునే అతిధుల్ని కలుస్తారు.                                   


విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడుకూడా రేవంత్ తనకు ఇష్టమైన రీతిలో స్టైలిష్ గా ఉండే డ్రెస్ లే ధరిస్తున్నారు.  అమెరికా పర్యటనలో ఆయన సూట్లు వేసుకోలేదు కానీ.. స్టైలింగ్ తప్పలేదు.


ఇక అధికార సమీక్షలకు ఫార్మల్స్ లోనే వెళ్తున్నారు. ఇటీవల ఎక్కువగా వైట్ షర్ట్..  జీన్స్ ప్యాంట్ లో వెళ్తున్నారు. ఒక్కో సారి షర్టు కలర్ మారుతోంది. అంతే కానీ.. ముఖ్యమంత్రి అంటే ...  వైట్ అండ్ వైట్ తో మెరిసిపోవాలని అనుకోవడం లేదు.                       


రేవంత్ యాటిట్యూట్ సామాన్యులకు నచ్చుతోంది. ముఖ్యమంత్రి కూడా మనలో ఒకడే అన్న భావన చాలా మందిలో వస్తోంది. అయితే సంప్రదాయ మైండ్ సెట్‌కు...  రాజకీయ నేతలు అలాగే ఉండాలని వాదిరించే వారు మాత్రం.. ఆయనపై విమర్శలు చేస్తున్నారు. సీఎం పీఠానికి ఆయన  గౌరవం ఇవ్వడం లేదని అంటూ ఉంటారు. కానీ రేవంత్.. డ్రెస్సింగ్ స్టైల్ ఆధునికంగా.. యువతను ఆకట్టుకునేలా ఉంది. ఇది సంప్రదాయవాదుల్ని నిరాశ పరుస్తోంది.