MP Raghurama krishna Raju resigned to YSRCP: ఆంధ్ర‌ప్రదేశ్‌(Andhrapradesh) అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌  పార్టీ(YSRCP) పార్ల‌మెంటు స‌భ్యుడు(MP), ఫైర్ బ్రాండ్ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు(Kanumuri Raghurama krishna Raju).. తాజాగా ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా(Resign)ను త్వ‌ర‌గా.. సాధ్య‌మైనంత వేగంగా ఆమోదించాల‌ని ఆయ‌న లేఖ‌లో కోరారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి(YS Jagan mohan reddy)కి ఆయ‌న నేరుగా అధికారిక ప‌త్రంపై లేఖ‌ను పంపించారు. ``మీరు న‌న్ను అన‌ర్హుడినిచేయాల‌ని అనుకున్నా.. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును ప్ర‌జాస్వామ్యం గౌర‌వించి.. న‌న్ను కాపాడింది`` అని వ్యాఖ్యానించారు. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఎన్నుకున్నం దుకు..వారికి తాను ఎంతో దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. సేవ‌ల విష‌యంలో మాత్రం లోటు రాలేద‌ని చెప్పారు. ``మీరు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌నందుకు నేను కూడా ఒక‌ప్పుడు చింతించా``న‌ని పేర్కొన్నారు. (ఎంపీగా అన‌ర్హ‌త వేటు వేయించ‌డంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నించింది). అంద‌రం ప్ర‌జాతీర్పు కోర‌వ‌ల‌సిన అవ‌స‌రం, స‌మ‌యం రెండూ వ‌చ్చాయ‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేర్కొన్నారు. న‌ర‌సాపురం స‌మ‌గ్ర అభివృద్ధికి ఎన‌లేని సేవ చేసిన‌ట్టు ర‌ఘురామ తెలిపారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను త‌న దారి చూసుకున్న‌ నేప‌థ్యంలో పార్టీకి, క్రియాశీల‌క స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. కాగా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రఘురామ టీడీపీ-జ‌న‌సేన మిత్రంప‌క్షం త‌ర‌ఫున న‌ర‌సాపురం స్థానం నుంచే మ‌రోసారి పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.


ముక్కోణ‌పు పోరులో.. 


2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావరి జిల్లాలోని న‌ర‌సాపురం పార్ల‌మెంటు స్థానం నుంచి వైఎస్సార్ సీపీ టికెట్‌పై క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ నెల‌కొంది. హోరా హోరీగా సాగిన ఈ పోరులో ర‌ఘురామ‌కృష్ణ రాజు త‌న స‌మీప ప్ర‌త్య‌ర్తులైన నాగ‌బాబు(జ‌న‌సేన‌), వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు(టీడీపీ)ల‌పై 31,909 ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. 


రెబ‌ల్‌గా 4 ఏళ్లు!


న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించిన ర‌ఘురామ‌కు.. ఆ త‌ర్వాత‌.. గ‌డ్డు ప‌రిస్థితి ఎదురైంది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కుల‌కు, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు పొడ‌చూపాయి. దీంతో కేవ‌లం ఏడాది కాలంలోనే పార్టీకి ఆయ‌న రెబ‌ల్‌గా మారారు. స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయ‌కుల ప్ర‌భావం, వారి ఆదిప త్యంతో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ర‌ఘురామ‌.. పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రెండుసార్లు.. పార్టీ త‌ర‌ఫున  చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ  ఏదోతేడా మాత్రం కొన‌సాగింది. దీనికి తోడు ఎంపీ అనుచ‌రుల‌పై స్థానిక ఎమ్మెల్యేలు.. పార్టీ నాయ‌కులు కేసులు పెట్ట‌డం.. ఆయ‌న ఫ్లెక్సీలు పెట్ట‌కుండా అడ్డుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో ప్రారంభ‌మైన వివాదాలు.. రెబ‌ల్‌గా మారే వ‌ర‌కు సాగాయి. ఇలా.. మొత్తం త‌న ఐదేళ్ల ఎంపీ ప‌ద‌వీ కాలంలో 4 ఏళ్ల పాటు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రెబ‌ల్‌గానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా త‌న మ‌కాంను ఢిల్లీకి మార్చుకున్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. అక్క‌డ నుంచే రాజ‌కీయా లు చేయ‌డం ప్రారంభించారు. అనేక అంశాల‌పై ఆయ‌న త‌న నిర‌స‌న గ‌ళాన్ని వినిపించారు. సీఎం జ‌గ‌న్ కేంద్రంగా కూడా ఆయ‌న అనేక విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, కేసులు కూడా పెట్టారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ హైకోర్టుల్లో కేసులు కూడా వేశారు. అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఉన్న‌కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని కోరుతూ.. పిటిష‌న్లు వేశారు. ఇలా.. అనేక రూపాల్లో ర‌ఘురామ పోరు సాగించారు. ఇక‌, ఏపీ సీఐడీ అధికారులు ర‌ఘురామ‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. ఆయ‌న‌పై లాఠీ చార్జి చేశార‌న్న వివాదాలు ఓ రేంజ్‌లో ర‌చ్చ రేపాయి.  ఆ త‌ర్వాత సుప్రీం కోర్టు జోక్యంతో హైద‌రాబాద్‌లోని ఆర్మీ ఆసుప‌త్రిలో చికిత్స గురించి తెలిసిందే.


కేసుల రాజుగా.. 


``మీరు న‌న్ను కెలికితే.. నేను మీ నాయ‌కుడిని(సీఎం జ‌గ‌న్‌) కెలుకుతా`` అంటూ వ్యాఖ్యానించిన ర‌ఘురామ‌.. అదే ప‌నిచేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌పై అనేక కేసులు కోర్టుల్లో దాఖ‌లు చేశారు. 


+ 2021 ఏప్రిల్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.


+ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012 నుంచి బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. 


+ ఏపీలో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. 


+ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియం ర‌ద్దు చేస్తున్నార‌ని పేర్కొంటూ మ‌రోసారి కోర్టుకెళ్లారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులువేస్తున్నార‌ని కోర్టులో పిటిష‌న్ వేశారు. 


+ తాజాగా సీఎం జ‌గ‌న్‌.. రెండు హెలికాప్ట‌ర్లు లీజుకు తీసుకుంటున్నార‌ని, ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని పేర్కొంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.